: వన్డే బెర్తు కోసం బౌలింగ్ సాధన చేస్తున్న యువ బ్యాట్స్ మన్


టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్నా వన్డే జట్టు విషయానికొచ్చేసరికి ఛటేశ్వర్ పుజారా ఇంకా రిజర్వ్ బెంచ్ కే పరిమితమవుతున్నాడు. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని ఈ బరోడా బ్యాట్స్ మన్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా, నెట్స్ లో కఠోరంగా బౌలింగ్ సాధన చేస్తున్నాడు. తాను ఉపయుక్తమైన బౌలర్ నని నిరూపించుకోగలిగితే వన్డే జట్టులో బెర్తు లభిస్తుందన్నది పుజరా ఆశ. దీనిపై ఆ యువకెరటం మీడియాతో మాట్లాడుతూ, 'నెట్స్ లో బౌలింగ్ చేయడం ప్రారంభించాను. వన్డేలో పార్ట్ టైమ్ బౌలర్ గా జట్టుకు ఉపయోగపడాలన్నది నా ఆలోచన' అని పేర్కొన్నాడు. పుజారా ఇటీవల ముగిసిన ఆసియా కప్ కు టీమిండియాలో చోటు దక్కించుకున్నా తుది జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు.

  • Loading...

More Telugu News