: జేబులో వైద్యుడు!


ఇది స్మార్ట్ ఫోన్ యుగం! అన్నింటిని అరచేతి నుంచే చక్కబెట్టుకోవడాన్ని సుసాధ్యం చేస్తున్నాయి స్మార్ట్ ఫోన్లు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం, నెట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవడం, ఆన్ లైన్లోనే బిల్లులు కట్టడం వంటివి ఈ ఆధునిక తరం ఫోన్ల ద్వారా మనకు సమకూరిన సౌకర్యాలు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి వైద్య సేవలూ అందించేందుకు స్మార్ట్ ఫోన్లు సిద్ధమయ్యాయి. ఓ ప్రత్యేక యాప్ తో పాటు ఓ లెన్స్ ఉంటే చాలు మీ జేబులో డాక్టర్ ఉన్నట్టేనంటున్నారు అమెరికాలోని హూస్టన్ వర్శిటీ పరిశోధకులు.

దీనిద్వారా, వ్యాధి ఏమిటో నిమిషాల్లో చెప్పేయొచ్చట. ఆ లెన్స్ లో ఓ గ్లాస్ స్లైడ్, బంగారంతో చేసిన పలుచని ఫిల్మ్ ఉంటాయి. ఆ ఫిల్మ్ పై వేలాది సూక్ష్మ రంధ్రాలుంటాయి. ఆ లెన్స్ ను చర్మంపై ఉంచి ప్రత్యేకమైన కాంతిని ప్రసారంచేస్తే ఆ రంధ్రాల ద్వారా అది చర్మకణాల్లోని యాంటీబాడీలను గుర్తిస్తుందట. ఆ సమాచారాన్ని స్మార్ట్ ఫోన్ లోని యాప్ విశ్లేషించి వ్యాధి ఏమిటో ఇట్టే చెప్పేస్తుందని పరిశోధకులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News