: జైరాం రమేష్ పై ఉండవల్లి ఫైర్
కేంద్ర మంత్రి జైరాం రమేష్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ పతనమవుతుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పని ఖతమవుతుందని చెప్పారు. శ్మశానం నుంచి వీరభద్రుడు పుడతాడని... కిరణ్ పెట్టిన పార్టీ కూడా అలాంటిదే అని తెలిపారు. కాంగ్రెస్ కు పిండం పెట్టడానికే జైరాం రమేష్ గోదావరి తీరానికి వచ్చారని అన్నారు.