: చర్చలు విఫలం.. రేపట్నుంచి ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాల (ఈయూ, టీఎంయూ) చర్చలు విఫలమ్యాయి. ఐఆర్ (మధ్యంతర భృతి) కి సంబంధించి ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రేపు ఉదయం నుంచి కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి.