: బీజేపీ సభలో కనిపించని వెంకయ్యనాయుడి కటౌట్లు
హైదరాబాదులో కాసేపట్లో బీజేపీ 'తెలంగాణ ఆవిర్భావ సభ' జరగబోతోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితరులు హాజరవుతున్నారు. అయితే సభా ప్రాంగణంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడి కటౌట్లు కనిపించలేదు. పూర్తిగా తెలంగాణ సభ కావడంతో ఈ సభకు వెంకయ్యనాయుడు హాజరు కావడంలేదు. దీంతో ఆయన కటౌట్లు, ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది.