: ఎర్రబెల్లికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల తీర్మానం
టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు తీర్మానం చేయడమేమిటా అనుకుంటున్నారా? ఇది నిజం. గత కొన్ని రోజులుగా ఎర్రబెల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం వరంగల్ జిల్లాలో ఊపందుకుంది. దీంతో జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు సమావేశమై ఎర్రబెల్లి వ్యవహారంపై చర్చించారు. అనంతరం ఎర్రబెల్లిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోరాదని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఒక వేళ ఎర్రబెల్లికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే... ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరించారు.