: పవన్ సభకు ఊపందుకున్న ఏర్పాట్లు


టాలీవుడ్ లో ప్రస్తుతం మహర్దశ నడుస్తున్న హీరో ఎవరంటే పవన్ కల్యాణ్ పేరే చెబుతారు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఆయన రేంజి అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడాయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. తన పొలిటికల్ ఎంట్రీపై సంకేతాలు వెలువరించినప్పటి నుంచి పవన్ అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా తన రాజకీయ రంగప్రవేశంపై స్పష్టతనిచ్చేందుకు మార్చి 14న హైదరాబాదులో సభ ఏర్పాటు చేస్తున్నారు. అందుకు మరో మూడు రోజులే సమయం ఉండడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి.

ఈ సభకు పవన్ అభిమానులు, సినీ రంగ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవుతారని భావిస్తున్నారు. కాగా, కొత్త పార్టీ పెడతాడా? లేక, ఏదైనా పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తాడా? అన్న విషయంపై పవన్ గానీ, ఆయన సన్నిహితులుగానీ పెదవి విప్పడంలేదు. తన రాజకీయ ప్రస్థానంపై పవన్ తన మిత్రుడు, శ్రేయోభిలాషి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో లోతుగా చర్చిస్తున్నట్టు సమాచారం. ఏదేమైనా, ఈ నెల 14తో పవన్ పొలిటికల్ ఎంట్రీపై ఉత్కంఠ వీడనుంది.

  • Loading...

More Telugu News