: పులి.. ఎక్కడున్నా పులేనట!
'పులి ఎక్కడున్నా పులే..'! ఈ మాటలు ఇవ్వాళ అసెంబ్లీ లాబీలో తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్థన రెడ్డి నోట వెంబడి వచ్చాయి. సందర్భమేమిటంటారా.. లాబీల్లో నాగం, ముద్దుకృష్ణమ నాయుడు పరస్పరం ఎదురుపడ్డారు. టీడీపీలో ఉండేటప్పడు మీ వార్తలు పతాక శీర్షికల్లో వచ్చేవంటూ, అప్పుడు మీరు పులిలా ఉండేవారని, ఇప్పుడు పిల్లిలా మారిపోయారని ముద్దుకృష్ణమ.. నాగంను ఉద్ధేశించి సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి స్పందించిన నాగం.. ఎక్కడున్నామన్నది ముఖ్యం కాదంటూ, 'పులి ఎక్కడున్నా పులే' అని బదులిచ్చారు.