: మాతో పొత్తు కోసం పార్టీలు ఎదురు చూస్తున్నాయి: రాజ్ నాథ్ సింగ్
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు ఖాయంగా కనిపిస్తుండటంతో పలు పార్టీలు కాషాయ పార్టీతో పొత్తుకు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. దాంతో, ధీమాగా ఉన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాదులో మాట్లాడుతూ, తమతో పొత్తు పెట్టుకునేందుకు దేశంలో చాలా పార్టీలు ఎదురు చూస్తున్నాయని అన్నారు. అయితే, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని తెలిపారు.