: ఏం శంకర్రావ్.. ఎలా ఉన్నావ్: ఎమ్మెల్యేకు సీఎం పరామర్శ
అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావును
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేడు పరామర్శించారు. హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిని సీఎం
అడిగి తెలుసుకున్నారు. గ్రీన్ ఫీల్డ్స్ భూముల
కేసులో నెలరోజుల కిందట
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు
శంకర్రావు సహ
కరించకపోవడంతో
పోలీసులు కఠినంగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన
అస్వస్థతకు గురవడంతో కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే.