: ఎన్నికల తర్వాత ఐపీఎల్ జరుపుకుంటే అభ్యంతరంలేదు: హోం శాఖ


ఐపీఎల్-7 వేదిక ఎక్కడన్న దానిపై ఇంకా అనిశ్చితి తొలగలేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత వేదికను వెల్లడిస్తామని చెప్పిన బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో నేడు కేంద్ర హోం శాఖ మరో ప్రతిపాదనను క్రికెట్ బోర్డు ముందుంచింది. వేసవిలో ఎన్నికలు ముగిసిన తర్వాత భారత్ లోనే ఐపీఎల్ జరుపుకోవచ్చని, అందుకు తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. ఐపీఎల్-7 వాస్తవానికి ఏప్రిల్ 9న ఆరంభం కావాల్సి ఉంది. అదే సమయంలో భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. దీంతో, తాము ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా భద్రత కల్పించలేమని హోం శాఖ అశక్తత వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై సమీక్షించిన బీసీసీఐ వర్గాలు ఐపీఎల్ వేదికను బంగ్లాదేశ్ గానీ, యూఏఈకి గానీ మార్చాలని భావించాయి. అయితే, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు.

  • Loading...

More Telugu News