: విమానం అదృశ్యం వెనుక ఉగ్రవాద కోణం...?


మలేసియన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం కనిపించకుండా పోవడం వెనుక టెర్రరిస్టుల హస్తం ఉందన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. ఆ విమానంలో మొత్తం 227 మంది ప్రయాణికులుండగా, వారిలో ఇద్దరు దొంగిలించిన పాస్ పోర్టులతో విమానం ఎక్కారు. వారు తొలుత యూరోపియన్లని భావించినా, తాజాగా వారిలో ఒకరు ఇరాన్ దేశస్తుడని తేలింది. అతని పేరు పౌరియా నూర్ మహ్మద్ మహర్దాద్ (19) అని మలేసియా పోలీసు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి వివరాలు తెలియరాలేదని పేర్కొన్నారు. ఇరాన్ దేశస్తుడికి ఉగ్రవాద లింకుందనడానికి ఆధారాలేవీ లేవని, అయితే, అతడి నేపథ్యాన్ని పరిశీలిస్తున్నామని మలేసియా పోలీసు అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News