: భారత్, అమెరికా సంయుక్తంగా ముందుకు సాగాలి: ఒబామా
అమెరికాలో భారత నూతన రాయబారి సుబ్రమణ్యం జయశంకర్ కు సాదర స్వాగతం చెబుతూ అధ్యక్షుడు బరాక్ ఒబామా ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు. ఇరు దేశాలు ఎన్నో అంశాల్లో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన జయశంకర్ విధి నిర్వహణలో విజయులవ్వాలని అభిలషించారు. ఈ సందర్భంగా జయశంకర్ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్ ల తరపున ఒబామాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ స్వాగత కార్యక్రమానికి వైట్ హౌస్ లోని ఓవల్ కార్యాలయం వేదికగా నిలిచింది.