: పటేల్ పేరును గతంలో బీజేపీ వ్యతిరేకించింది: రాహుల్
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పెట్టేందుకు సిద్ధమౌతున్న బీజేపీ... గతంలో అహ్మదాబాద్ విమానాశ్రయానికి పటేల్ పేరు పెట్టాలనుకున్నప్పుడు వ్యతిరేకించిందని విమర్శించారు. గతంలో అముల్ కంపెనీ ఏర్పాటు చేసినప్పుడు కూడా బీజేపీ నేతలు వ్యతిరేకించారని తెలిపారు. బీజేపీకి సిద్ధాంతాలు, విప్లవాత్మకమైన ఆలోచనలు లేవని దుయ్యబట్టారు. మనుషుల మధ్య ఆగ్రహావేశాలు రెచ్చగొట్టి, కలహాలు సృష్టించడమే బీజేపీ పని అని మండిపడ్డారు.