: హైదరాబాదు చేరుకున్న రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, ఆ పార్టీ నేతలు అరుణ్ జైట్లీ, ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాదుకు చేరుకున్నారు. హైదరాబాదు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వారు సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరిగే తెలంగాణ ఆవిర్భావ సభలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ చేరుకున్న వెంటనే రాజ్ నాథ్ సింగ్ నేరుగా ఇటీవల కన్నుమూసిన బీజేపీ సీనియర్ నేత బంగారు లక్ష్మణ్ కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు. లక్ష్మణ్ మృతి పట్ల ఆయన తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.