: సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా బొత్స?
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అలాగే తెలంగాణ పీసీసీ రేసులో పొన్నాల, జానారెడ్డి ఉన్నారని తెలుస్తోంది. ఈ సాయంత్రం ఇరు ప్రాంతాలకు పీసీసీ అధ్యక్షులను ప్రకటించనున్నారు.