: కౌన్సిలర్ గా నామినేషన్ వేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రి శాసనసభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన తాడిపత్రి మాజీ మున్సిపల్ ఛైర్మన్, జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి అనూహ్యంగా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలోని 18, 34 వార్డులకు నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరగణంతో వచ్చిన ఆయన టీడీపీ తరపున నామినేషన్ వేశారు.