: పుత్రుడికి మొండిచేయి చూపిన కరుణానిధి


లోక్ సభ ఎన్నికల కోసం డీఎంకే విడుదల చేసిన జాబితాలో పార్టీ అధినేత కరుణానిధి కుమారుడు ఎంకే అళగిరికి చోటు దక్కలేదు. కొద్దికాలం కిందట సోదరుడు స్టాలిన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అళగిరిపై కరుణానిధి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఆయన పేరును అభ్యర్థుల జాబితా నుంచి తొలగించడంతో పార్టీ ద్వారాలు ఇక మూసేసినట్టయింది. దీనిపై కరుణానిధిని మీడియా ప్రశ్నించగా, అళగిరి ప్రస్తావన తెచ్చి తనను బాధించవద్దని సూచించారు.

కాగా, డీఎంకే తాజా జాబితాలో ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులకూ స్థానం దక్కింది. దయానిధి మారన్, ఎ. రాజాలపై పార్టీ విశ్వాసం ప్రకటించింది. మారన్ టెలికాం మంత్రిగా పనిచేసిన కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు రాగా, ఆయన స్థానంలో మంత్రి పదవి చేపట్టిన రాజా మొబైల్ నెట్ వర్క్ లైసెన్స్ ల కుంభకోణంలో ఇరుక్కున్నారు.

  • Loading...

More Telugu News