: టీఆర్ఎస్ నాయకత్వంపై వీహెచ్ ఆగ్రహం
కేంద్రమంత్రి జైరాం రమేష్ పై తీవ్ర విమర్శలు చేసిన టీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రావడం కేసీఆర్, హరీష్ రావుకు ఇష్టం లేనట్టుందన్నారు. తెలంగాణ రావడానికి కారణమైన జైరాం రమేష్ పైనే హరీష్ విమర్శలు చేయడం దారుణమన్నారు. సోనియా త్యాగానికి టీఆర్ఎస్ ఇచ్చే గౌరవం ఇదేనా? అని వీహెచ్ ప్రశ్నించారు.