: స్క్రీనింగ్ కు ముందు ఆరుషి తల్లిదండ్రులకు సినిమా చూపండి: బాంబే హైకోర్టు


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి, హేమరాజ్ జంట హత్యలపై దర్శకుడు, రచయిత మనీష్ గుప్తా 'రహస్య' పేరుతో హిందీలో ఓ చిత్రం నిర్మించారు. త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో అంతకుముందే ఆరుషి తల్లిదండ్రులకు సినిమా చూపించాలని బాంబే హైకోర్టు దర్శకుడిని ఆదేశించింది. ఈ మేరకు ఆరుషి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం పైవిధంగా ఆదేశాలిచ్చింది. కాగా, ఈ చిత్రానికి సీబీఎఫ్ సీ (సెంట్రల్ బోర్డ్ ఆప్ ఫిల్మ్ సర్టిఫికేషన్) యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే, అందులో ఆరుషికి సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత విషయాలు చూపలేదని, అంతా కల్పిత డ్రామాగానే సినిమా రూపొందించినట్లు తెలిపారు. ఆరుషి కేసులో గతేడాది నవంబర్ లో వైద్య దంపతులు రాజేష్, నూపుర్ తల్వార్ లకు అలహాబాద్ హైకోర్టు జివిత ఖైదు విధించిన సంగతి తెలిసింది. ప్రస్తుతం వారిద్దరూ ఘజియాబాద్ లోని దస్నా జైలులో ఉన్నారు.

  • Loading...

More Telugu News