: రెండున్నర కిలోల బంగారంతో అధికారులకు పట్టుబడిన విశాఖ వాసులు
శంషాబాదులో ఇటీవల బంగారం అక్రమ రవాణాతో పట్టుబడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కిలోల మోతాదులో పుత్తడిని గల్ఫ్ దేశాల నుంచి తీసుకువస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతున్న ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. ఇవాళ (మంగళవారం) ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులు భారీ స్థాయిలో బంగారాన్ని తీసుకువస్తూ శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు పట్టుబడ్డారు. దీనికి బాధ్యులైన ఐదుగురి నుంచి రెండున్నర కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ప్రయాణికులందరూ విశాఖకు చెందిన వారేనని అధికారులు చెప్పారు.