: పీసీసీలను ఈ రోజు ప్రకటిస్తాం: దిగ్విజయ్ సింగ్
ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పీసీసీలను ప్రకటిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. సీమాంధ్రలో కాంగ్రెస్ నుంచి వెళుతుంటే, తెలంగాణలో పలువురు నేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో హైదరాబాదులోనే ఉండి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తామని తెలిపారు. కొత్త పార్టీ పెట్టనని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ మాట తప్పారని విమర్శించారు.