: మున్సిపల్ ఎన్నికలకు లోక్ సత్తా మేనిఫెస్టో
త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ, స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు కోసం లోక్ సత్తా సుదీర్ఘంగా పోరాడిందని వివరించారు. స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వం మొక్కుబడిగా వ్యవహరిస్తోందన్నారు. 110 మున్సిపాలిటీలు, 8 కార్పోరేషన్లలో పోటీ చేస్తామని చెప్పారు.