: పోలవరం ప్రాజెక్టును సందర్శించిన జైరాం రమేష్
కేంద్ర మంత్రి జైరాం రమేష్ ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత మంది వెళ్లిపోయినా వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పారు. పార్టీ నుంచి ఒకరు పోతే 10 మంది వస్తారని తెలిపారు. పోలవరం పూర్తి కాదన్న బలరాం నాయక్ వ్యాఖ్యలు సరికాదన్నారు. మరో ఐదారు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. కావూరి సాంబశివరావు పార్టీ మారతారనే విషయం తనకు తెలియదని చెప్పారు.