: షర్మిల పాదయాత్రపై టీఎన్ఎస్ఎఫ్ ఆగ్రహం


ప్రజల సొమ్మును దోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, షర్మిల పాదయాత్రను ప్రజలు నమ్మరని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీ.ఎన్.ఎస్.ఎఫ్) విమర్శించింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తన హయాంలో ఆయన కుటుంబసభ్యులు జగన్, షర్మిల, అల్లుడు అనిల్ కు వేల కోట్ల రూపాయల ధనం దోచిపెట్టారని టీఎన్ఎస్ఎఫ్ ఆరోపించింది.

తాము చేపట్టిన 'అవినీతిపై విద్యార్థి సమరం' కార్యక్రమానికి మంచి ఆదరణ లభించిందని 
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ తెలిపారు. అవినీతిపరులకు వ్యతిరేకంగా ప్రజలతో లక్ష ఉత్తరాలు, రెండు కోట్ల సంతకాల సేకరణ చేపట్టి రాష్ట్రపతికి అందజేస్తామని టీఎన్ఎస్ఎఫ్ నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News