: ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులపై విచారణ చేపట్టాలని ‘సుప్రీం’ ఆదేశం


ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులకు సంబంధించి విచారణను ఏడాదిలోపు పూర్తి చేయాలని కిందిస్థాయి కోర్టులు, ట్రయల్ కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఆ కేసుల్లో రోజువారీ విచారణను చేపట్టాలని ‘సుప్రీం’ సూచించింది. పబ్లిక్ ఇంట్రస్ట్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ (ఎన్జీవో) దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ (సోమవారం) విచారించింది.

తీవ్రమైన నేరాలతో సంబంధమున్న కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు... కోర్టుల్లో విచారణ సుదీర్ఘంగా సాగుతుండడంతో పదవుల్లో కొనసాగుతున్నారని ఎన్జీవో తన పిటిషన్ లో పేర్కొంది. అందువల్ల వారిపై విచారణను వేగంగా పూర్తిచేసేలా కోర్టులకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిశీలించిన ధర్మాసనం... పైన చెప్పిన విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసుల్లో విచారణను ఏడాదిలోపే పూర్తిచేయాలని ఆదేశించింది. ఒకవేళ ఏడాదిలోపు విచారణ పూర్తి చేయలేకపోతే... అందుకు తగిన కారణాన్ని చూపుతూ, తామున్న పరిధిలోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

  • Loading...

More Telugu News