: పీటర్సన్ కు వీసా చిక్కులు


ఇంగ్లండ్ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ కు వీసా చిక్కులొచ్చిపడ్డాయి. తాను అత్యవసర పని నిమిత్తం భారత్ రావాల్సి ఉందని, అయితే లండన్ లోని భారత రాయబార కార్యాలయం ఇంతవరకు వీసా జారీ చేయలేదని ట్విట్టర్లో వాపోయాడు. గత పది రోజుల నుంచి వీసా కోసం ఎదురుచూపులు తప్పలేదని పేర్కొన్నాడు. యాషెస్ అనంతరం ఇంగ్లిష్ క్రికెట్ బోర్డు కేపీపై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ ఓటములకు కేపీని బలిపశువును చేశారని పలువురు స్టార్ క్రికెటర్లు బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఖాళీగానే ఉన్న పీటర్సన్ ఐపీఎల్-7కు పూర్తి సమయం అందుబాటులో ఉంటాడు. ఈ విధ్వంసక బ్యాట్స్ మన్ తాజా సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కేపీ గత సీజన్లోనూ ఢిల్లీ జట్టుకు ఆడగా, మోకాలి గాయంతో సగంలోనే వైదొలిగాడు. ఆ సీజన్లో దారుణ పరాజయాలతో డెవిల్స్ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచారు. 33 ఏళ్ళ కేపీ తన కెరీర్లో ఇప్పటివరకు 104 టెస్టులాడి 8181 పరుగులు చేశాడు. ఇక 136 వన్డేలాడి 4440 పరుగులు సాధించాడు.

  • Loading...

More Telugu News