: ఆర్టీసీ కార్మిక నేతలను చర్చలకు ఆహ్వానించిన కార్మిక శాఖ
ఆర్టీసీలో సమ్మె తలపెట్టిన కార్మిక సంఘ నేతలను రాష్ట్ర కార్మిక శాఖ చర్చలకు ఆహ్వానించింది. కార్మిక సంఘాలైన ఎన్.ఎం.యూ, టీ.ఎం.యూలను మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చర్చలకు రావాల్సిందిగా కార్మిక శాఖ కోరింది. ఈ నెల 12 నుంచి ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మె తలపెట్టిన సంగతి తెలిసిందే.