: ఇటలీ మెరైన్ల కేసు విచారణ పాటియాలా కోర్టుకు
భారత జాలర్లను హత్య చేసిన కేసులో ఇటలీ నావికులను విచారించే బాధ్యతను పాటియాలా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్ కు ఢిల్లీ హైకోర్టు అప్పగించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సాల్ ఈ కేసును విచారించనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ప్రభుత్వం ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరగా, ఢిల్లీ హైకోర్టు నుంచి తాజా ఆదేశాలు వెలువడ్డాయి.