: ఈ నెల 12 నుంచి హైదరాబాదులో 'ఎయిర్ షో'


భారత విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నెల 12 నుంచి హైదరాబాదులో 'ఎయిర్ షో' నిర్వహించనుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ షోలో 18 దేశాలకు చెందిన 250 విమానయాన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనున్నాయి. బేగంపేట విమానాశ్రయం వేదికగా ఈ షో జరగనుంది. ప్రపంచంలో అతి పెద్ద విమానాలు ఎయిర్ బస్ ఏ 380, బోయింగ్ 787 సహ 18 ఎయిర్ క్రాప్ట్ లను ప్రదర్శనకు ఉంచనున్నట్లు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి జి.అశోక్ కుమార్ వెల్లడించారు. ఈ షోను కేంద్ర విమానయాన శాఖ మంత్రి అజిత్ సింగ్ ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News