: శ్రీకాకుళం జిల్లాలో పడగవిప్పిన పాత కక్షలు
స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలవడంతో... గ్రామాల్లోని కక్షలు, విద్వేషాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని సమంతాపురంలో పాత కక్షలు బుసలుకొట్టాయి. గతంలో సర్పంచ్ ఎన్నికలు జరిగిన సమయంలో చోటుచేసుకున్న దాడులు ఈ రోజూ కొనసాగాయి. కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరిగాయి. ఈ ఘర్షణలో టీడీపీ నేత వెంకటరమణ మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో మరింత రక్తపాతం చోటు చేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.