: కేసీఆర్ పై మండిపడిన ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు


కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా విద్యార్థులు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఎన్.సి.సి. గేటు వరకు ర్యాలీ నిర్వహించి, ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే, ఇక కొత్తగా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని, తాము ఇక నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సి వస్తుందని ఓయూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News