: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు లక్ష్మయ్య ఇక లేరు


తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఖమ్మం జిల్లా గోకినేపల్లి వాసి పయ్యావుల లక్ష్మయ్య అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమం, సాయుధ పోరాటం అనంతరం సీపీఎంలో కొనసాగిన లక్ష్మయ్య గోకినేపల్లి సర్పంచ్ గా కూడా పనిచేశారు. పదిహేనేళ్ల వయస్సులోనే గ్రామంలో జరుగుతున్న అరాచకాలను ఆయన ప్రశ్నించడంతో పాటు పోలీసు చర్యలకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను సమీకరించారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు పెట్టి నిజామాబాద్ జైలుకు పంపించారు.

18 నెలలు జైలు జీవితం గడిపిన తర్వాత ఆయన, అక్కడి నుంచి తప్పించుకుని స్వగ్రామానికి చేరుకొన్నారు. అనేక ఉద్యమాలు చేసిన లక్ష్మయ్య అనంతరం జన జీవన స్రవంతిలో కలిసిపోయారు. గోకినేపల్లి గ్రామ సర్పంచ్ గా పదేళ్లు, టేకులపల్లి సహకార బ్యాంకు ఛైర్మన్ గా రెండు పర్యాయాలు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతికి వామపక్షాలతో పాటు టీడీపీ నేతలు కూడా సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News