: ఏపీలో లోక్ సభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఎస్పీ
ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అసోం మూడు రాష్ట్రాల లోక్ సభ అభ్యర్థుల జాబితాను సమాజ్ వాదీ పార్టీ ఇవాళ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, వరంగల్, మచిలీపట్నం, నర్సాపురం, అరకు లోక్ సభ నియోజకవర్గాల నుంచి సమాజ్ వాది పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ పేర్కొన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ లో తొమ్మది అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ పోటీ చేయనున్నట్టు ఆయన చెప్పారు.