: పెంపుడు కుక్కను పెళ్ళి చేసుకున్న బ్రిటన్ మహిళ!


దక్షిణ లండన్ కు చెందిన 47 ఏళ్ళ అమందా రోజర్స్ అనే మహిళ భర్త నుంచి విడాకులు పొంది ఒంటరిగా జీవిస్తోంది. అయితే, ఆమెను ఒంటరితనం వేధించసాగింది. ఓ తోడు ఉంటే బావుంటుందన్న ఆలోచన ఆమెలో విచిత్రమైన ఆలోచనలకు బీజం వేసింది. తనను వెన్నంటి ఉండే పెంపుడు కుక్క షెబాతో జీవితం పంచుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన రావడమే తరువాయి 200 మంది అతిథుల సమక్షంలో కుక్కను వివాహం చేసుకుంది. క్రొయేషియాలోని స్ప్లిట్ ఇందుకు వేదికైంది. ఈ విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.

ఆనాటి తన వివాహ ముచ్చట్లను మీడియాతో పంచుకున్న అమందా రోజర్స్, తాను మోకాళ్ళపై కూర్చుని ప్రపోజ్ చేయగా, షెబా తనకు అంగీకారమన్నట్టుగా తోకాడించిందని మురిసిపోతూ చెప్పింది. అప్పుడు షెబాకు తాను ముద్దు కూడా పెట్టానని వెల్లడించింది. తమ వివాహం చట్టబద్ధం కాకపోయినా, షెబా తన జీవితంలో ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో ఈ పెళ్ళి ద్వారా చాటిచెప్పానని అమందా పేర్కొంది.

  • Loading...

More Telugu News