: క్యాబ్స్ పై నిఘాకు సైబరాబాద్ పోలీస్ నిర్ణయం


ఇటీవల కాలంలో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై అత్యాచార ఘటనలు ఎక్కువగా నమోదవుతుండడంపై సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో క్యాబ్స్, కాల్ టాక్సీలను సైబరాబాద్ పోలీస్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించాలని స్పష్టం చేశారు. మే 1 లోపు రిజిస్ట్రేషన్ చేయించకపోతే భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనంతరం కూడా గుర్తింపు పొందకపోతే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. కాగా, రిజిస్ట్రేషన్ చేయించుకున్న క్యాబ్స్, కాల్ టాక్సీలకు క్యూఆర్ కోడ్ నెంబర్, గుర్తింపు కార్డు ఇస్తారు. వీటి వివరాలను డ్రైవర్ సీట్ వెనుకభాగంలో తప్పక ప్రదర్శించాలి. ఈ క్యూఆర్ కోడ్ ను స్మార్ట్ ఫోన్ సాయంతో స్కాన్ చేసి క్యాబ్ వివరాలు తెలుసుకోవచ్చు.

  • Loading...

More Telugu News