: మోడీని బలపరచాలనే బీజేపీలో చేరా: జీవిత
మోడీ నాయకత్వంలో శాంతిభద్రతలతో, సుఖశాంతులతో జీవించగలమని దేశంలోని కోట్లాది మంది ప్రజలు నమ్ముతున్నారని... తాను కూడా ఇదే విశ్వసిస్తున్నానని సినీనటి జీవిత తెలిపారు. ఈ రోజు బీజేపీలో చేరిన సందర్భంలో జీవిత ఈ వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోడీని బలపరచాలనే తపనతోనే బీజేపీలో చేరానని చెప్పారు. బీజేపీకే కాకుండా, బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రతి పార్టీకి కూడా మద్దతు ఇవ్వాలని కోరారు. తాను ఎంతో ఆలోచించి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నానని...తాను తీసుకున్న నిర్ణయం సరైనదని చెప్పారు.