: రాజమండ్రిలో కిరణ్ సభకు అనుమతి నిరాకరణ
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజమండ్రిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అనుమతి తిరస్కరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా సభకు అనుమతి ఇవ్వలేమని కలెక్టర్ కార్యాలయం తెలిపింది. దాంతో, కిరణ్ వర్గీయులు సభకు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూస్తున్నారు.