: కాగ్ నివేదికేమన్నా.. భగవద్గీత, బైబిల్, ఖురాన్ లతో సమానమా?: సీఎం


అసెంబ్లీలో విపక్షాల దాడులను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దూకుడు మంత్రం పఠిస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై టీడీపీ సభ్యుడు పయ్యావుల ఆరోపణలపై 
సీఎం బదులిచ్చారు. విద్యుత్ కొనుగోళ్ళపై కాగ్ ఇచ్చిన నివేదిక ఏమన్నా భగవద్గీత, బైబిల్, ఖురాన్ లతో సమానమా? అంటూ వ్యాఖ్యానించారు.

ఇతర ప్రాజెక్టుల కంటే జెన్ కో అధిక ధర ప్రతిపాదించినట్టు కాగ్ నివేదిక వెల్లడిస్తోందని, అయినా, కాగ్ పరిశీలనలు అన్నీ నిజం కావంటూ తన వ్యాఖ్యలు సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. కాగ్ నివేదికపై ప్రజా పద్దుల సంఘం తుది నివేదిక ఇస్తుందని ముఖ్యమంత్రి సభలో తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని అంగీకరిస్తూ.. విపక్షాలు నిర్మాణాత్మక సూచనలివ్వాలిగానీ, సమస్యను మరింత జఠిలం చేసేలా వ్యవహరించొద్దని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News