: పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి
రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12వ తేదీ, బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రామ్ శంకర్ నాయక్ తెలిపారు. ఇంటర్మీడియెట్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 2,661 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన చెప్పారు. ఈ దఫా 19,78,379 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నట్టు ఆయన తెలిపారు. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకల్లా పరీక్షా హాలుకు చేరుకోవాలని, పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.