: హృదయాల్ని తాకిన షారూక్ ప్రసంగం


'రజనీకాంత్ కు నేను వీరాభిమానిని. నేనిక్కడికి రావడానికి గల మూడు కారణాలలో ఇదే మొదటిది' అంటూ బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చేసిన ప్రసంగం కొచ్చడియాన్ ఆడియో విడుదల వేడుకలో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. రజనీకాంత్ కథానాయకుడుగా రూపొందుతున్న కొచ్చడియాన్ ఆడియో విడుదల వేడుక నిన్న చైన్నైలో జరిగింది. ఇందులో పాల్గొన్న షారూక్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల కిందట ముంబైలో ఒక సినిమా షూటింగ్ చూడ్డానికి వెళ్లాను. అందులో రజనీ నటన చూసి పాఠాలు నేర్చుకున్నా. దూరంగా నిలబడి రజనీని చూశా. ఆయనొక పెద్ద అద్దం ముందు నించుని నోటిలోకి సిగరెట్ ను విసరడం ప్రాక్టీస్ చేస్తున్నారు. చాలామంది నటులు వారి పనులకే పరిమితమైతే, రజనీ మాత్రం సాధన చేస్తూనే ఉంటారు. నాకు ఇదొక జీవిత పాఠం" అని షారూక్ చెప్పారు.

ఈ వేడుకకు రావడానికి రెండో కారణం ఏమిటంటే.. 'రావణ్ సినిమా నిర్మాణం సందర్భంగా రజనీ ఎంతో సాయం చేశారు. అందుకు రజనీసర్ కు కృతజ్ఞతలు. సౌందర్య, లతా మేడమ్ అర్ధరాత్రి వరకూ మేల్కొని సాయం చేశారు. చెన్నైకు వచ్చిన ప్రతీసారీ ఎంతో ప్రేమను అందించారు. అందుకే స్నేహితుడిగా ఈ రోజు వచ్చా.

మూడో కారణం ఏమిటంటే, విజ్ఞానం కోసం నేనిక్కడకు వచ్చా. దేశం గర్వించదగ్గ చిత్రాలు ఇక్కడే రూపొందాయి. బాలచందర్ సర్, శంకర్ సర్ మరెంతో మంది తమ సినిమాల ద్వారా ఎంతో నేర్పించారు. నాలుగేళ్ల క్రితం సౌందర్య (రజనీ కూతురు) ఈ కలల ప్రాజెక్టు గురించి చెప్పారు. ఈ సినిమాలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉత్తమంగా ఉండబోతోంది' అంటూ షారూక్ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News