: వైఎస్సార్సీపీకి హరిరామజోగయ్య గుడ్ బై
వైఎస్సార్సీపీకి సీనియర్ నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ జగన్ జేబు సంస్థలా మారిందని మండిపడ్డారు. జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేకపోయానని చెప్పారు. ఆ పార్టీలో ఇమడలేకపోతున్నానని తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు.