: కొత్త పార్టీల వల్ల ఏం ఒరగదు: చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సీమాంధ్రలో పుట్టుకొస్తున్న కొత్త పార్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో స్పందించారు. కొత్త పార్టీల వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సింది సమర్థత, తపన అని చెప్పారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసే సత్తా ఒక్క తెలుగుదేశానికే ఉందని బాబు ధీమా వ్యక్తం చేశారు. చల్లా రామకృష్ణారెడ్డి చేరికతో కర్నూలు జిల్లాలో టీడీపీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.