: మహంతి పదవీకాలం పొడిగింపుపై హైకోర్టులో పిల్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి పదవీకాలం పొడిగింపుపై హైకోర్టులో పిల్ దాఖలైంది. గవర్నర్, కేబినెట్ అనుమతి లేకుండా పదవీకాలం పొడిగించలేరని పిల్ లో పిటిషనర్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన ఉన్న నేపథ్యంలో పదవీకాలాన్ని ఎలా పొడిగిస్తారని ప్రశ్నించారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది. అంతేకాకుండా, దీనిపై వారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.