: యాదగిరిగుట్టలో ఇవాళ రాత్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం
ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ (సోమవారం) రాత్రి 9.45 గంటలకు స్వామివారికి లక్ష్మీదేవితో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ వివాహ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు గుట్టకు తరలివస్తున్నారు. దేవస్థాన అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.