: ఈ కవలలకు ఒకే ఉద్యోగం... ఒకే బోయ్ ఫ్రెండ్... అన్నీ కలసే!
కలసి పుట్టారు. అన్నీ కలసే పంచుకుంటున్నారు ఆస్ట్రేలియా కవలలు అన్నా డెసింక్వే, లూసీ. ఈ కవలలు ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారారు. కారణమేమిటంటే, వీరు ఏం చేసినా కలసి చేయడమే. నిమిషం వ్యవధిలో పుట్టినప్పటికీ చూడ్డానికి ఒకేలా ఉంటారు. ముఖ కవళికల్లో కొద్దిగా తేడాలు ఉన్నాయని, వాటిని కూడా ఒకేలా మార్చుకోవడం కోసం 2లక్షల డాలర్లు ఖర్చు చేసి పలు సర్జరీలు చేయించుకున్నారు. బ్రెస్ట్ ఇంప్లాంట్స్, ఐబ్రోస్, పెదాలు పెరిగేలా శస్త్రచికిత్సలు చేయించుకున్నారు.
ఇక వీరిద్దరూ ఒకే ఫేస్ బుక్ ఖాతా వాడతారు. ఒకే ఉద్యోగం చేస్తారు. ఒకే మంచాన్ని పంచుకుంటారు. డేటింగ్ కూడా ఓకే బోయ్ ఫ్రెండ్ తో చేస్తున్నారు. అది కూడా ఏకాంతం లేకుండా సుమా. ఏక కాలంలో తాము శృంగారం చేసుకుంటామని వీరు చెబుతున్నారు. తమ టేస్ట్ ఒకటే కనుక ఒకే బోయ్ ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు. వీరి ఒకే మంచం, ఒకే కంచం విషయం తెలిసి ఎంతో మంది పెళ్లి చేసుకుంటామంటూ ఆఫర్లు ఇస్తున్నారట. ఇన్ని విశేషాలు ఉన్నాయి కనుకనే వీరు సెన్సేషనల్ ట్విన్స్ గా మారారు. ప్రస్తుతం వీరు ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఉంటున్నారు.