: టీడీపీ తీర్థం పుచ్చుకున్న చల్లా
సీమాంధ్రలో మరో కాంగ్రెస్ నేత సైకిలెక్కారు. కర్నూలు జిల్లా మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుంచి గెలుపొంది... ఆ సీటును చంద్రబాబుకు కానుకగా ఇస్తానని... ఈ సందర్భంగా చల్లా తెలిపారు.