: ప్లీజ్, నా ఇంటర్వ్యూ ఎక్కువసార్లు ప్లే చేయండి: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ఇంటర్వ్యూని ప్లే చేయాలని టీవీ యాంకర్ ను అభ్యర్థించినట్లు ఉన్న వీడియో ఒకటి యూట్యూబ్ లో ఎక్కువమందిని ఆకర్షిస్తోంది. టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం అయిపోయిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ యాంకర్ తో మాట్లాడుతూ, తన ఇంటర్వ్యూలో ముఖ్యమైన భాగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని.. దయచేసి ఎక్కువ సార్లు ప్లే చేయాలని కోరారు. దానికి అలాగే ప్లే చేస్తామంటూ యాంకర్ బదులిచ్చారు. ఈ వీడియో యూట్యూబ్ లో ఎక్కువగా ప్రచారంలో ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కేజ్రీవాల్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు.