: వ్యవస్థలన్నింటినీ బాబు భ్రష్టు పట్టించారు: శోభా నాగిరెడ్డి


టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత శోభా నాగిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించింది ఆయనేనని ఆమె విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె, 'బాబును మించిన నమ్మక ద్రోహి మరొకరు లేరని ఎన్టీఆర్ చెప్పింది నిజం కాదా?' అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై
 జగన్ పై  కుట్ర పన్నాయన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉండబట్టే ధైర్యంగా ఎదుర్కొంటున్నామన్నారు. అయితే, తనపై వున్న కేసులపై బాబు ఎందుకు స్టే తెచ్చుకుంటున్నారని శోభా నాగిరెడ్డి బాబును నిలదీశారు.

  • Loading...

More Telugu News