: ఆమ్ ఆద్మీ తప్పుచేసినట్లు తేల్చిన ఈసీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు ఎలక్షన్ కమిషన్ తేల్చింది. అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల గుజరాత్ పర్యటనలో భాగంగా అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం ముందు ఆమ్ ఆద్మీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. దీనిపై ఈసీ ఆమ్ ఆద్మీ పార్టీకి షోకాజు నోటీసులు జారీ చేసి వివరణ కోరింది.
పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిర్బంధంపై అప్పటికప్పుడు వ్యక్తమైన స్పందన అని, ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసింది కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఈసీ నోటీసుకు వివరణ ఇచ్చింది. కాగా, ఈ వివరణ సంతృప్తికరంగా లేదని ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషనర్ కేంద్ర ఎన్నికల సంఘానికి తాజాగా నివేదిక పంపినట్లు సమాచారం.